తప్పుకున్న జస్టిస్ రమణ

25 April, 2019 - 5:44 PM

(న్యూవేవ్స్ డెస్క్)

న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ రంజన్ గోగోయ్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలపై అంతర్గత విచారణ జరుపుతున్న కమిటీ నుంచి జస్టిస్ ఎన్వీ రమణ తప్పుకున్నారు. ఈ కమిటీ నుంచి తాను తప్పుకుంటున్నట్లు సుప్రీంకోర్టు రిజిస్ట్రార్‌కు ఎన్వీ రమణ గురువారం లేఖ రాశారు.

లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న చీఫ్ జస్టిస్ రంజన్ గోగోయ్‌పై మహిళా ఉద్యోగిని లైంగిక ఆరోపణలు గుప్పించింది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టులోని ముగ్గురు న్యాయమూర్తులతో అంతర్గత విచారణ కమిటీని కోర్టు ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో జస్టిస్ ఎస్ ఏ బాబ్డే, జస్టిస్ ఇందిరా బెనర్జి, ఎన్వీ రమణు ఉన్నారు.

అయితే జస్టిస్ రంజన్ గోగోయ్, ఎన్వీ రమణ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అని, రమణ తరచు… రంజన్ గోగోయ్ ఇంటికి వెళ్తారని.. ఆరోపించింది. అందువల్ల ఈ విచారణలో తనకు న్యాయం జరగదని సదరు మహిళా ఉద్యోగి అభ్యంతరం వ్యక్తం చేశారు. దాంతో ఈ కమిటీ నుంచి తప్పుకోవాలని జస్టిస్ ఎన్వీ రమణ నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలో ఎన్వీ రమణ స్థానంలో మరొకరిని నియమించనున్నారు.