జెర్సీ టీజర్ వస్తోంది

11 January, 2019 - 4:05 PM

(న్యూవేవ్స్ డెస్క్)

నేచురల్ స్టార్ నానీ నటిస్తున్న తాజా చిత్రం జెర్సీ. ఈ చిత్ర టీజర్ జనవరి 12వ తేదీ.. సంక్రాంతి పండగను పురస్కరించుకుని విడుదల చేస్తున్నట్లు హీరో నానీ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. ఈ చిత్రానికి గౌతమ్ తిన్ననురి దర్శకత్వం వహించారు.

గతంలో గౌతమ్… మళ్లీ రావా చిత్రానికి దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. క్రికెట్ బ్యాక్ డ్రాప్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో నాని సరసన కన్నడ నటి శ్రద్ధ శ్రీనాథ్ నటిస్తున్నారు. జెర్సీ చిత్రానికి అనిరుధ్ రవిచంద్రన్ స్వరాలు సమకూరుస్తున్నారు.

సుర్యదేవర నాగ వంశీ.. ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రం ఈ ఏడాది వేసవిలో విడుదల కానుంది. 2018లో నానీ నటించి చిత్రాలు కృష్ణార్జునయుద్ధం, దేవదాస్. ఈ రెండు చిత్రాలు ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే.