స్ఫూర్తి రగిలిస్తున్న ‘నానీ’

12 January, 2019 - 5:03 PM

(న్యూవేవ్స్  డెస్క్)

మళ్లీ రావా చిత్ర దర్శకుడు గౌతమ్ తిన్ననూరి. అతడి దర్శకత్వంలో నేచురల్ స్టార్ నానీ తాజాగా నటిస్తున్న చిత్రం జెర్సీ. ఈ చిత్ర టీజర్ శనివారం ట్విట్టర్, ఫేస్ బుక్‌లో నాని విడుదల చేశారు. ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు. క్రికెట్ నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కుతుంది. ఈ చిత్రంలో అర్జున్ పాత్రలో నానీ ఒదిగిపోయి నటిస్తున్నారు. సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్‌పై పీడీపీ ప్రసాద్ ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. ఈ చిత్రాన్ని సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు.

అయితే ఈ టీజర్‌ విశేషంగా అకట్టుకుంటుంది. అంతే కాదు.. హీరో నానీ పలికే వ్యాఖ్యాలు స్ఫూర్తి నింపేవిగా ఉన్నాయి. నీ ఏజ్ ఇప్పుడు 36 అర్జున్.. ప్రొఫెషనల్ స్పోర్ట్స్ నుంచి రిటైర్ అయ్యే ఏజ్ అనే వాయిస్ ఓవర్‌తో ఈ టీజర్ స్టార్ట్ అయి… ఆపేసి ఓడిపోయినవాడున్నాడు కానీ.. ప్రయత్నించి ఓడిపోయిన వాడు లేడు అంటూ నాని చెప్పే డైలాగ్ సూపరబ్‌గా.. యువతకు స్ఫూర్తిని రగిలించేలా ఉన్నాయి.