గౌతమ్ నెక్స్ట్ వరుణ్‌తో..

23 April, 2019 - 5:15 PM

 

(న్యూవేవ్స్ డెస్క్)

హైదరాబాద్: నేచురల్ స్టార్ నానీ హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం జెర్సీ. ఈ చిత్రం ఇటీవల విడుదలై సూపర్ డూపర్ హిట్ సాధించింది. ఈ చిత్రంలో హీరో నాని నటనకు, దర్శకుడు గౌతమ్‌ పనితనానికి టాలీవుడ్‌లోని ఇతర హీరోల నుంచి ప్రశంసలు వెల్లువలా వస్తున్నాయి.

అలాగే దర్శకుడు గౌతమ్‌కి దర్శకత్వం చేయమంటూ నిర్మాతల నుంచి ఆఫర్లు వెల్లువెత్తాయి. అయితే ప్రస్తుతం జెర్సీ సక్సెస్‌ను గౌతమ్ ఎంజాయి చేస్తున్నారు. అలాగే మెగా హీరో వరుణ్ తేజ్‌తో చిత్రాన్ని తెరకెక్కించేందుకు గౌతమ్ తిన్ననూరి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మించనున్నారని సమాచారం. మళ్లీ రావా చిత్రానికి గౌతమ్ గతంలో దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత జెర్సీ చిత్రానికి దర్శకత్వం వహించారు గౌతమ్. అయితే వరణ్ తేజ్.. ప్రస్తుతం రెండు చిత్రాల్లో నటిస్తు బిజీ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.