తెరపైకి జయలలిత బయోపిక్

21 September, 2018 - 7:33 PM

(న్యూవేవ్స్ డెస్క్)

ప్రస్తుతం బయోపిక్‌ల హవా నడుస్తోంది. ప్రతీ ఇండస్ట్రీలో దర్శకులు, నిర్మాతలు బయోపిక్‌లు తెరకెక్కించేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. టాలీవుడ్‌లో ఇటీవల విడుదలైన సావిత్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన చిత్రం మహానటి.

ఈ చిత్రం ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. విశ్వ విఖ్యాత నట సార్వభౌమ, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం యన్‌టీఆర్. ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ చిత్రం 2019 జనవరిలో విడుదలకు సిద్ధమవుతోంది.

అలాగే తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి, ప్రముఖ నటి జయలలితపై బయోపిక్ తెరకెక్కబోతోంది. అందుకు సంబంధించిన టైటిల్ పోస్టర్‌ని ప్రముఖ దర్శకుడు ఎ ఆర్ మురుగదాస్ ట్విట్ చేశారు. ‘‘ ది ఐరన్ లేడీ’’ అనే టైటిల్‌తో ఈ చిత్రం తెరకెక్కనుంది.

పేపర్ టేల్ పిక్చర్స్ బ్యానర్‌పై తెరకెక్కనున్న ఈ చిత్రానికి ప్రియదర్శని దర్శకత్వం వహిస్తున్నారు. ఫిబ్రవరి 24 జయలలిత జయంతి. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది ఇదే రోజున ఈ చిత్ర షూటింగ్ ప్రారంభించనున్నారు.