‘జై లవకుశ’ స్టోరీ లీక్ అయ్యిందోచ్!

11 September, 2017 - 12:01 PM

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన ‘జై లవకుశ’ స్టోరీ ఇదేనంటూ తెలుస్తోంది. మరి ఆ కథేంటో ఒకసారి చూద్దామా!

ఒక తల్లికి పుట్టిన ముగ్గురు కొడుకులు… వాళ్లని రామ,లక్ష్మణ, భరతుడిలా పెంచాలని అనుకుంటుంది. కానీ వారు మాత్రం రావణ, రామలక్ష్మణులుగా అవుతారు. అనుకోకుండా చిన్నప్పుడే ఈ ముగ్గురు అన్నదమ్ములు ఒకరినొకరు దూరమవుతారు. ఇక ప్రస్తుత కాలానికి వస్తే…
ముందుగా లవ కుమార్ ఎంట్రీ ఇస్తాడు. బ్యాంక్ మేనేజర్ గా పనిచేస్తుంటాడు. అందరితో మంచిగా ఉండటం లవకు ఉన్న అలవాటు. లవకు ఎప్పుడు కూడా తన ఇద్దరు సోదరుల గురించే ఆలోచన. సీన్ కట్ చేస్తే కుశ ఎంట్రీ. డబ్బు సంపాదించి విదేశాలకు వెళ్లి ఎంజాయ్ చేయాలనే సరదా కుర్రోడు. నా అనుకున్న తనవాళ్లకు సాయం చేయడానికి ఎంతదూరమైనా వెళ్తాడు. అందుకోసం కొంతమంది రౌడీలతో గొడవపడతాడు. ఆ రౌడీలే సమయం చూసుకొని కుశ అనుకొని ‘లవ’పై ఎటాక్ చేస్తారు. ఎవరిపైనో ఎటాక్ జరిగిందని గమనించి అతడిని కాపాడుదామని వెళ్ళేసరికి లవ మరియు కుశ ఒకరికొకరు చూసుకుంటారు. అయితే ఇద్దరు ఒకరినొకరు పరిచయం చేసుకున్న తర్వాత అన్నదమ్ములం గుర్తించి వారి జీవితం కొనసాగిస్తారు.

ఈ సమయంలో లవకు బ్యాంక్‌లో ఏదో సమస్య అని తెలుసుకొని, లవ స్థానంలో కుశ బ్యాంక్‌కి వెళ్లి ఆ సమస్యను పరిష్కరించి, అక్కడ నానా హంగామా చేస్తాడు. ఆ తర్వాత లవ కుమార్‌కి తనని పెంచిన వాళ్ళు పెళ్లి సంబంధం కుదురుస్తారు. ఆ పెళ్లి నిశ్చితార్థంకి కూడా లవ కాకుండా కుశ వెళ్లి.. అక్కడ పెళ్లి కూతురు(నందిత) ఫ్రెండ్ రాశి ఖన్నాకి లవ్ ప్రపోజ్ చేస్తాడు. కానీ లవకుమార్ మాత్రం నందితనే పెళ్లి చేసుకోవాలని అనుకుంటాడు. సీన్ కట్ చేస్తే… లవ, కుశల మేనమామ కూతురు నివేధా థామస్‌. నివేధాకు తన బావ లవతో పరిచయం ఎక్కువ. అప్పుడప్పుడు లవ వచ్చి నివేధాను కలిస్తూ వుండేవాడు. నివేధా మాత్రం తన ఫ్రెండ్స్‌తో కలిసి హాస్టల్లో వుండేది. లవ పోలీకలతో వున్న ఓ వ్యక్తి నివేధాను తీసుకెళ్లాడని లవకి నివేధా ఫ్రెండ్స్ చెప్తారు. మరి లవ, కుశ కాకుండా ఇంకెవరు నివేధాను తీసుకెళ్తారు అని అనుకునే సమయంలో జై ఎంట్రీ వస్తుంది.

మంచి పనులు చేస్తూనే రావణాసురుడు లక్షణాలు కలిగిన వ్యక్తి జై. రాజకీయ పరంగా ఎమ్మెల్యేగా ఎదగాలనుకుంటాడు. ఇందులో భాగంగానే రాజకీయ పార్టీ శత్రువులతో గొడవలు జరుగుతుంటాయి. ఇలా తన ప్రచార సమయంలో ఓసారి నివేధాను చూస్తాడు జై. తన బావ లవకుమార్ అనుకొని జైకి దగ్గరవుతుంది నివేధా. ఇక నివేధాను తన ఇంటికి తెచ్చేసుకుంటాడు జై.

నివేధా కోసం వెతుకుతున్న సమయంలో జై గురించి తెలుస్తుంది. జై, లవ, కుశలు అన్నదమ్ములు అని తెలుసుకుంటారు. ఇక చివర్లో ఈ ముగ్గురిని చంపేయాలని విలన్ వర్గాలు ప్రయత్నిస్తాయి. కానీ ఈ ముగ్గురు కలిసి వాళ్లకున్న సమస్యలను తీర్చేసుకుంటారు. చివర్లో … జైకి జోడిగా నివేధా, లవకుమార్‌కి జోడిగా నందిత,  కుశకి జోడిగా రాశిఖన్నాలు జతకడతారు. ఇక జై కూడా రావణ లక్షణాలను తగ్గించుకొని మంచి మనిషిగా మారే ప్రయత్నం మొదలుపెడతాడు.