‘జై లవకుశ’ సెన్సార్ పూర్తి

13 September, 2017 - 3:57 PM

వరుస విజయాలతో దూసుకుపోతోన్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా బాబీ దర్శకత్వంలో ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై నందమూరి కళ్యాణ్‌రామ్ నిర్మిస్తున్న చిత్రం ‘జై లవకుశ’. భారీ అంచనాలతో రూపొందుతున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేసారు. ఈ చిత్రం తాజాగా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డ్ సభ్యులు ఈ చిత్రానికి U/A సర్టిఫికెట్‌ను అందజేసారు.

రాక్‌స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించిన పాటలు ఇటీవలే బ్లాక్ బస్టర్ హిట్టయ్యాయి. ట్రైలర్, వీడియో సాంగ్స్‌కు భారీ రెస్పాన్స్ వస్తోంది. సినిమాపై అంచనాలు రోజురోజుకి మరింతగా పెరిగిపోతున్నాయి. ఎన్టీఆర్ సరసన రాశిఖన్నా, నివేధా థామస్ హీరోయిన్లుగా నటించగా.. నందిత ఓ ముఖ్య పాత్రలో నటించింది. సెప్టెంబర్ 21న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో ‘జై లవకుశ’ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ చిత్రానికి చోటా కె నాయుడు సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఆర్ట్ డైరెక్టర్ ఏ ఎస్ ప్రకాష్, ఎడిటింగ్ : కోటగిరి వెంకటేశ్వర రావు, తమ్మి రాజు. విసువల్ ఎఫెక్ట్స్ : అనిల్ పాదూరి (అద్విత క్రియేటివ్ స్టూడియోస్)