‘జై లవకుశ’ ఆడియో డేట్ ఫిక్స్

23 August, 2017 - 1:27 PM


యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న ‘జై లవకుశ’ చిత్ర ఆడియో విడుదల కార్యక్రమానికి ముహూర్తం ఫిక్సయ్యింది. రాక్‌స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్ర ఆడియో విడుదల కార్యక్రమాన్ని సెప్టెంబర్ 3న అభిమానుల సమక్షంలో, గ్రాండ్‌గా జరుపనున్నారు. ఈ వేడుకకు దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి ముఖ్య అతిథిగా విచ్చేయనున్నారని తెలుస్తోంది. ఎన్టీఆర్ నటించిన పలు చిత్రాల ఆడియో వేడుకలకు రాజమౌళి ముఖ్య అతిథిగా విచ్చేసారు. ఇపుడు అదే సెంటిమెంట్ మరోసారి రిపీట్ కానున్నట్లుగా తెలుస్తోంది.

ఈ వేడుకలో దేవిశ్రీప్రసాద్ లైవ్ పర్ఫార్మెన్స్ ఇవ్వనున్నట్లుగా సమాచారం. ఇందులోని ఓ స్పెషల్ బిట్‌ను ఎన్టీఆర్‌తో పాడించినట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే విడుదలైన ‘జై’ టీజర్‌కు భారీ రెస్పాన్స్ వచ్చింది. ఆగష్టు 24న ‘లవకుమార్’ క్యారెక్టర్‌కు సంబంధించిన టీజర్‌ను విడుదల చేయనున్నారు. అలాగే ‘కుశ’ క్యారెక్టర్‌కు సంబంధించిన టీజర్‌ను విడుదల చేయనున్నారు. బాబీ దర్శకత్వంలో ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌పై కళ్యాణ్‌రామ్ నిర్మిస్తున్నారు. తారక్ సరసన రాశిఖన్నా, నివేధా థామస్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. సెప్టెంబర్ 29న సినిమాను గ్రాండ్‌గా విడుదల చేయనున్నారు.