ట్రైలర్‌లో ‘టూ స్మార్ట్’

12 July, 2019 - 7:14 PM

(న్యూవేవ్స్ డెస్క్)

హైదరాబాద్: ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ఎనర్జీటిక్ హీరో రామ్ నటించి చిత్రం ఐ స్మార్ట్ శంకర్. ఈ చిత్ర ట్రైలర్‌ను శుక్రవారం విడుదల చేశారు. అరె.. ఏం చేస్తున్నావురా బీచ్‌లో… అనే డైలాగ్‌తో ఈ ట్రైలర్ ప్రారంభమైంది. ఈ చిత్రంలో మాటలు అన్నీ పక్కా తెలంగాణ భాషలో ఉన్నాయి. అలాగే ఈ చిత్రంలో హీరో రామ్ కూడా పక్కా వెరైటీగా.. స్టైలిష్ క్రాఫ్‌తో కనిపించాడు. ఈ చిత్రంలో రామ్ సరసన హీరోయిన్లుగా నిధి అగర్వాల్, నభా నటేష్ నటిస్తున్నారు. ఈ చిత్రానికి ప్రముఖ నటి ఛార్మీ కౌర్, పూరీ జగన్నాథ్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం జులై 18న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది.