ట్రైలర్‌లో ‘సైరా’

15 June, 2019 - 5:04 PM

(న్యూవేవ్స్ డెస్క్)

హైదరాబాద్: ప్రముఖ దర్శకుడు సురేందర్ రెడ్డి దర్శకత్వంలో మెగా‌స్టార్ చిరంజీవి నటిస్తున్న చిత్రం సైరా నరసింహరెడ్డి. బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడిన ఉయ్యాలవాడ నరసింహరెడ్డి జీవిత కథ ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. అయితే ఈ చిత్ర ట్రైలర్ విడుదలకు ముహూర్తం ఖరారు చేసింది చిత్ర యూనిట్.

ఈ చిత్ర ట్రైలర్‌ను మెగాస్టార్ చిరంజీవి జన్మదినం ఆగస్ట్ 22న విడుదల చేయాలని నిర్ణయించినట్లు తెలిసింది. అయితే ఈ చిత్రాన్ని దసరా కానుకగా ఆక్టోబర్‌లో విడుదల చేస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి నటించిన ఈ 151 వ చిత్రంపై భారీగా అంచనాలు ఏర్పడ్డాయి.

ఈ చిత్రంలో అమితాబ్, నయనతార, తమన్నా, జగపతి బాబు, తనికెళ్ల భరణి తదితరులు నటిస్తున్నారు. గతేడాది అంటే 2018… జనవరి 22 సందర్భంగా సైరా టీజర్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. సరిగ్గా ఏడాదికి ఈ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేస్తున్నారు.

కొణిదెల ప్రోడక్షన్స్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. ఈ చిత్రానికి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. దాదాపు రూ. 300 కోట్లకు పైగా బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.