ఫస్ట్‌ లుక్ ‘ఫిక్స్’

09 February, 2020 - 3:27 PM

(న్యూవేవ్స్ డెస్క్)

తిరుమల: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న తాజా చిత్రం వకీల్ సాబ్ ఫస్ట్ లుక్ మార్చిలో విడుదల చేయనున్నట్లు ప్రముఖ నిర్మాత దిల్ రాజు స్పష్టం చేశారు. అలాగే ఈ చిత్రాన్ని మేలో ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఆదివారం తిరుమలలో శ్రీవారిని వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో.. దిల్ రాజు, హీరోయిన్ సమంత, హీరో శర్వానంద్, దర్శించుకున్నారు.

అనంతరం ఆనంద నిలయం వెలుపల దిల్ రాజు మాట్లాడుతూ.. ‘జాను’ చిత్రం విజయం సాధించడం సంతోషంగా ఉందన్నారు. స్వామి వారి ఆశీస్సుల కోసం తిరుమల వచ్చామని ఆయన తెలిపారు. అలాగే నేచురల్ స్టార్ నాని, సుధీర్ బాబు నటిస్తున్న చిత్రానికి ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారని దిల్ రాజు వెల్లడించారు. ఈ చిత్రం మార్చి 25న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుందని దిల్ రాజు పేర్కొన్నారు.

బాలీవుడ్ లో మంచి విజయాన్ని అందుకున్న చిత్రం పింక్. ఈ చిత్రాన్ని వకీల్ సాబ్ పేరుతో తెలుగులో రీమేక్ చేస్తున్నారు. అయితే ఈ చిత్ర కథాంశంలోని పలు మార్పులు చేర్పులు చేశారు. నాని హీరో నటించిన ఎంసీఏ దర్శకుడు వేణు శ్రీరామ్.. వకీల్ సాబ్ కు దర్శకత్వం వహిస్తున్నారు. కాగా ఈ చిత్రానికి నిర్మాతలుగా దిల్ రాజు, బోని కపూర్ వ్యవహరిస్తున్నారు.