‘ఇంతలో ఎన్నెన్ని వింతలో’ థియేట్రికల్ ట్రైలర్

12 January, 2018 - 5:06 PM

నందు కథానాయకుడిగా నటించిన మూవీ ‘ఇంతలో ఎన్నెన్ని వింతలో’. సౌమ్య వేణుగోపాల్‌, పూజా రామచంద్రన్‌ కథా నాయికలు. వరప్రసాద్‌ వరికూటి దర్శకుడు. హరిహర చలన చిత్ర సంస్థ బ్యానర్‌పై ఎస్‌. శ్రీకాంత్‌‌రెడ్డి, ఇప్పిలి రామమోహనరావు ఈ సినిమా నిర్మాతలు. ‘ఇంతలో ఎన్నెన్ని వింతలో’ చిత్ర థియేట్రికల్ ట్రైలర్‌‌ని ప్రసిద్ధ టాలీవుడ్ డైరెక్టర్ వివి వినాయక్ తన మూవీ ‘ఇంటిలిజెంట్’ క్లైమాక్స్ షూటింగ్ సెట్‌లో ఆవిష్కరించారు.

అనంతరం వినాయక్ మాట్లాడుతూ.. ‘వరప్రసాద్‌ దర్శకుడిగా మారి సినిమా చేస్తున్నాడని తెలిసినప్పుడు చాలా సంతోషించా. తను నా శిష్యుడే. వరప్రసాద్ మూవీ ‘ఇంతలో ఎన్నెన్ని వింతలో’ టాక్ కూడా తెలిసింది. చాలా బాగుంది అని విన్నాను. ఇప్పుడు థియేట్రికల్ ట్రైలర్ చూశాను. చాలా బాగుంది. ఈ సినిమా మంచి హిట్టయి, అగ్ర కథానాయకులతో సినిమాలు తీసే స్థాయికి ఎదగాలని కోరుకొంటున్నా’ అన్నారు.

నిర్మాత ఇప్పిలి రామమోహనరావు మాట్లాడుతూ.. ‘మా చిత్రం థియేట్రికల్ ట్రైలర్‌‌ను వివి వినాయక్ మేం అడగ్గానే విడుదల చేయడం సంతోషంగా ఉంది. ఉత్కంఠభరితమైన కథ, కథనాలతో తెరకెక్కిన ఓ విభిన్నమైన చిత్రమిది. ఫిబ్రవరిలో సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నాం’ అన్నారు.

నరసింహ, కృష్ణతేజ, త్రిశూల్‌, గగన్‌ విహారి, రమేష్‌, భార్గవ్‌, కిషోర్‌ దాస్‌, సత్తన్న తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: ఎస్‌.మురళీమోహన్‌‌రెడ్డి, సంగీతం: యాజమాన్య.