ప్రపంచ కప్ అంపైర్లు, రిఫరీలు వీరే..

26 April, 2019 - 5:03 PM

(న్యూవేవ్స్ డెస్క్)

దుబాయ్: ప్రపంచ కప్ క్రికెట్ టోర్నీకి కౌంట్‌‌డౌన్ స్టార్టయింది. ఇంగ్లండ్‌లోని వేల్స్ వేదికగా మే నెల 30 నుంచి జరిగే ఐసీసీ ప్రపంచకప్ కోసం యావత్ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఇప్పటికే ఈ టోర్నీలో పాల్గొనే ఎనిమిది జట్లు తమ ఆటగాళ్ల వివరాలు ప్రకటించాయి. ఇక ఈ టోర్నీ‌లో అంపైర్లుగా వ్యవహరించే 22 మంది పేర్లను శుక్రవారం నాడు ఐసీసీ వెల్లడించింది. ఇందులో మాజీ ప్రపంచకప్ విజేతలు కుమార ధర్మసేన (శ్రీలంక), పాల్ రైఫెల్ (ఇంగ్లండ్), డేవిడ్ బూన్ (ఆస్ట్రేలియా) ఉన్నారు. ఈ జాబితాలో కేవలం ఒక భారత్ అంపైర్‌‌కు మాత్రమే చోటు దక్కడం గమనార్హం. కర్ణాటకకు చెందిన సుందరం రవి ప్రపంచకప్ అంపైర్ల ప్యానల్‌‌లో చోటు దక్కించుకున్నారు.

వరల్డ్ కప్ అంపైర్లు: అలీం దర్, కుమార్ ధర్మసేన, మారైస్ ఎరాస్మస్, క్రిస్ గాఫెన్ని, ఇయాన్ గౌల్డ్, రిచర్డ్ ఇల్లింగ్‌వర్త్, రిచర్డ్ కెట్టిల్‌బరో, నైగెల్ ల్లాంగ్, బ్రూస్ అక్సెన్‌ఫొర్డ్, సుందరం రవి, పాల్ రీఫెల్, రాడ్ టక్కర్, జొయెల్ విల్సన్, మైఖేల్ గో, రుచిర పల్లియాగెర్గె, పాల్ విల్సన్.

మ్యాచ్ రిఫరీలు: క్రిస్ బ్రాడ్, డేవిడ్ బూన్, ఆండి పైక్రాఫ్ట్, జెఫ్ క్రోవ్, రంజన్ ముదుగాలె, రిచీ రిచర్డ్‌‌సన్.
2019 ప్రపంచకప్ తర్వాత ప్రముఖ అంపైర్ ఇయాన్ గౌల్డ్ తన కెరీర్‌‌కి గుడ్‌‌బై చెప్పనున్నారు. 1983 ప్రపంచకప్‌‌లో ఇంగ్లండ్ జట్టులో వికెట్‌ కీపర్‌‌గా వ్యవహరించిన గౌల్డ్ తన కెరీర్‌‌లో 74 టెస్టులు, 135 వన్డేలు, 37 టీ-20ల్లో అంపైర్‌‌గా వ్యవహరించారు.