అదరగొడుతున్న ‘మజిలీ’

07 March, 2019 - 3:50 PM

(న్యూవేవ్స్ డెస్క్)

నాగ చైతన్య, సమంత హీరోహీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం మజిలీ. వీరిద్దరు పెళ్లి పీటలు ఎక్కిన తర్వాత నటిస్తున్న తోలి చిత్రం మజిలీ. ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ చిత్ర నిర్మాణ దశలోనే ప్రీ రిలీజ్ బిజినెస్ భారీగా జరుగుతుంది. ఏప్రిల్ 5న రిలీజ్‌కు రెడీ అవుతున్న ఈ సినిమా శాటిలైట్ హక్కులను సన్ నెట్ వర్క్ సంస్థ రూ. 5 కోట్లకు తీసుకుంది.

అలాగే డిజిటల్ హక్కులను అమెజాన్ ప్రైమ్ రూ. 3.5 కోట్లు, హిందీ అనువాద హక్కులు రూ. 4.5 కోట్లకు అమ్ముడయ్యాయి. ఏప్రిల్ 5న విడుదలకు సిద్ధమవుతున్న మజిలీ చిత్రానికి శివా నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నారు. గోపి సుందర్ ఈ చిత్రానికి స్వరాలు సమకురుస్తున్నారు.