ఎఫైర్‌కు కూడా ఆమె పనికిరాదట!

31 August, 2017 - 4:00 PM


బాలీవుడ్ క్వీన్‌గా పేరొందిన కంగనా రనౌత్ మరోసారి బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్‌పై పరోక్ష కామెంట్లు చేసి హాట్ టాపిక్‌గా మారింది. గతంలో వీరిద్దరి మధ్య పలు సంఘటనల విషయంలో కోర్టు మెట్లెక్కే పరిస్థితి వరకు వెళ్లింది. అయితే తాజాగా ఈ అమ్మడు ఓ టీవి షోలో పాల్గొని హృతిక్‌పై పరోక్ష కామెంట్లు చేసింది.

అతన్ని ఇక్కడి పిలిచి, ప్రశ్నలు అడగండి. నోటీసులు పంపించి తనకు రాత్రిళ్లు నిద్రలేకుండా చేసాడని, ఒత్తిడి మానసిక వేదనకు గురయ్యానని.. తనని ఇంత ఇబ్బంది గురిచేసిన అతను క్షమాపణలు చెప్పాలంటూ ఆ షోలో చెప్పుకొచ్చింది. అయితే కంగనా మాట్లాడేది హృతిక్ గురించేనని అందరికీ తెలిసినప్పటికీ.. ఎక్కడా కూడా హృతిక్ పేరు వాడకుండా తన ఆవేదనను వ్యక్తం చేసింది.

కానీ కంగనా మాటలకు కౌంటర్ ఎటాక్‌గా హృతిక్.. మీడియా చెబుతున్న ఆ మహిళతో కంటే పోప్‌తో ఎఫైర్ పెట్టుకోవడానికి తాను సిద్ధంగా వుంటానని ట్వీట్ చేసాడు. కానీ ఆ తర్వాత ఆ ట్వీట్‌ను హృతిక్ డిలీట్ చేయడంతో.. కంగనా మాట్లాడింది హృతిక్ గురించేనని క్లారిటీ వచ్చేసింది. మరి ఈ గొడవ ఇంకెంత దూరం వెళుతుందో చూడాలి.