ఇక రెట్టింపు పింఛన్లు

11 January, 2019 - 6:39 PM

(న్యూవేవ్స్ డెస్క్)

నెల్లూరు: ఈ జనవరి నుంచే రెట్టింపు పింఛన్లు అందిస్తామని ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు ప్రకటించారు. శుక్రవారం శ్రీ పోట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని బోగోలులో జరిగిన జన్మభూమి కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… రూ. 1000 ఉన్న పింఛన్లు ఇక నుంచి రూ. 2000 ఇవ్వనున్నట్లు చంద్రబాబు వెల్లడించారు. ఈ నెల పింఛన్ తీసుకునే వాళ్లకి వచ్చే నెలలో మిగిలిన రూ. 1000 కూడా చెల్లిస్తారని చెప్పారు.

ప్రస్తుతం రాష్ట్రంలో 51 లక్షల మందికి ఎన్టీఆర్ భరోసా పింఛన్లు అందిస్తున్నట్లు చంద్రబాబు తెలిపారు. మరో 4 లక్షల మందికి కొత్తగా పింఛన్లు ఇవ్వనున్నట్లు చంద్రబాబు ఈ సభా వేదిక ద్వారా ప్రకటించారు. ఈ పింఛన్ల కోసం నెలకు రూ. 550 కోట్లను ప్రభుత్వం భరిస్తుందని చంద్రబాబు పేర్కొన్నారు. ఖర్చు చేస్తున్న సర్కారు