సస్పెన్స్ ‘హిట్’

25 February, 2020 - 8:18 PM

(న్యూవేవ్స్ డెస్క్)

శైలేష్ కొలను దర్శకత్వంలో విశ్వక్ సేన్, రుహాని శర్మ జంటగా నటిస్తున్న చిత్రం హిట్. ఈ చిత్రం ఫిబ్రవరి 28న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఈ చిత్రంలోని స్నీక్ పీక్ వీడియోను మంగళవారం విడుదల చేశారు. దాదాపు 4 నిమిషాల39 సెకన్లు పాటు సాగిన ఈ వీడియో ఆద్యంతం సస్పెన్స్‌ ను తలపించింది. విక్రమ్ రుద్రరాజు పాత్రలో పోలీస్ అధికారిగా విశ్వక్ సేన్ నటిస్తున్నారు. అయితే విడుదల చేసిన ఈ వీడియోలో.. నేరం జరిగిన ప్రాంతంలో పోలీసులు గాలిస్తుంటారు.

ఆ క్రమంలో ఇక్కడ తవ్వండంటూ.. సరిగ్గా  మృతదేహం ఉన్న ప్రాంతాన్ని విశ్వక్ సేన్.. చూపించడం.. తవ్వుతుండగా… చేతి వేళ్లు కనపడడం.. అంతలో వాసన రావడంతో ముక్కు ముకుంటారు. అయితే విశ్వక్ సేన్.. మాత్రం దూరంగా పరిగేత్తుతాడు. ఆ క్రమంలో గతంలో చోటుచేసుకున్న సంఘటనల తాలుక అలజడులు హీరో విశ్వక్ సేన్‌ను చుట్టుముడుతాయి. నేచురల్ స్టార్ నానీ సమర్పణలో వాల్ పోస్టర్ సినిమా బ్యానర్‌పై ఈ చిత్రం తెరకెక్కింది. ఈ చిత్రానికి వివేక్ సాగర్ స్వరాలు అందిస్తున్నారు.