ఫ్యాన్స్ కోసం…

07 November, 2019 - 5:22 PM

(న్యూవేవ్స్ డెస్క్)

ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌, రష్మిక మందన్న జంటగా నటిస్తున్న చిత్రం అల.. వైకుంఠపురంలో .. .  ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఇప్పటికే ఈ చిత్రంలోని రెండు పాటలను విడుదల చేయగా.. అవి కొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. అయితే అల్లు అర్జున్‌కి కేరళలో భారీగా ఫ్యాన్స్ ఉన్న సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో అల.. వైకుంఠపురంలో .. చిత్రాన్ని మలయాళంలో కూడా విడుదల చేయనున్నారు.

ఈ నేపథ్యంలో అల.. వైకుంఠపురంలో.. చిత్రం మలయాళ పోస్టర్‌ను చిత్ర యూనిట్ గురువారం విడుదల చేసింది. అలాగే ఈ చిత్రంలోని సామజవరగమన, రాములో రాముల .. అంటూ సాగా రెండు పాటలను మలయాళ వర్షెన్‌లో నవంబర్ 10వ తేదీన విడుదల చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించింది చిత్ర యూనిట్. కాగా అల.. వైకుంఠపురంలో.. మలయాళ పోస్టర్ గురువారం అంటే నవంబర్ 7వ తేదీన విడుదల చేయడానికి ఒక ముఖ్య కారణం ఉంది. అదీ త్రివిక్రమ్ శ్రీనివాస్ పుట్టిన రోజు. ఈ రోజు. దాంతో ఈ పోస్టర్‌ను విడుదల చేశారు.

నివేదిత పేతురాజ్, నవదీప్, టాబు, సుశాంత్, మురళీ శర్మ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. హరికా, హాసిని క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ బ్యానర్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. కె. రాధాకృష్ణ, అల్లు అరవింద్ నిర్మాతలుగా వ్యవహరించనున్నారు. ఈ చిత్రానికి ఎస్ ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం 2020, జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.