12న ఏపీ అసెంబ్లీలో వార్షిక బడ్జెట్

10 July, 2019 - 9:01 AM

(న్యూవేవ్స్ డెస్క్)

అమరావతి: ఈ నెల 11 నుంచి ఆంధ్రప్రదేశ్ శాసనసభ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అవుతాయి. ఈ మేరకు గవర్నర్ నరసింహన్ నోటిఫికేషన్ జారీ చేశారు. గురువారం ఉదయం 9 గంటలకు సమావేశాలు ప్రారంభం అవుతాయని పేర్కొన్నారు. ఈ నెల 12న వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వ తొలి వార్షిక బడ్జెట్‌ను ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ప్రవేశపెడతారు. అదే రోజున వ్యవసాయ బడ్జెట్‌ను మంత్రి కురసాల కన్నబాబు సభలో ప్రవేశపెడతారు.