జూలై 5న గోపీచంద్ `పంతం` రిలీజ్‌

13 June, 2018 - 5:07 PM

టాలీవుడ్ యాక్షన్ స్టార్ గోపీచంద్ హీరోగా కె.చ‌క్రవ‌ర్తి ద‌ర్శక‌త్వంలో శ్రీ స‌త్యసాయి ఆర్ట్స్ బ్యాన‌ర్‌‌పై కె.కె.రాధామోహ‌న్ నిర్మిస్తున్న చిత్రం ‘పంతం’. గోపీచంద్ 25వ చిత్రమిది. సినిమాకు సంబంధించిన కొన్ని కీల‌క‌మైన స‌న్నివేశాలు, పాట‌ల‌ను చిత్రీక‌ర‌ణ కోసం యూనిట్ యు.కె. వెళ్లిన సంగ‌తి తెలిసిందే. ఈ ఫారిన్ షెడ్యూల్ పూర్తిచేసుకున్న చిత్ర యూనిట్ హైదరాబాద్ చేరుకుంది. దీంతో సినిమా షూటింగ్ మొత్తం పూర్తయ్యింది.

రీసెంట్‌‌గా విడుద‌లైన టీజ‌ర్‌‌కి ట్రెమెండెస్ రెస్పాన్స్ వ‌స్తోంది. ఒక వైపు క‌మ‌ర్షియ‌ల్ ఎంట‌ర్‌‌టైన‌ర్‌‌గా ఉంటూనే మంచి మెసేజ్‌‌తో సినిమాను రూపొందిస్తున్నామ‌ని చిత్ర యూనిట్ వెల్లడించిన‌ట్లే.. సినిమా ఎలా ఉంటుందో టీజ‌ర్‌‌లో శాంపిల్ చూపించారు. ఓటును ఐదువేల‌కు అమ్ముకుని అవినీతి లేని స‌మాజం కావాలి, క‌రప్షన్ లేని కంట్రీ కావాలంటే ఎక్కడి నుండి వ‌స్తాయి అని హీరో కోర్టులో వేసే ప్రశ్న అంద‌రినీ ఆలోచింప‌చేసేదిగా, ఎమోష‌న‌ల్‌గా ఉంది. ఓ వైపు మంచి మెసేజ్‌‌తో పాటు సినిమాలో ప్రేమ‌, వినోదం వంటి అంశాలు పుష్కలంగా ఉండ‌బోతున్నట్లు టీజ‌ర్‌‌తో శాంపిల్ చూపించారు. దీంతో సినిమాపై అంచ‌నాలు పెరిగాయి. గోపీచంద్ ఇప్పటి వ‌ర‌కు క‌న‌ప‌డ‌ని క్యారెక్టర్‌‌లో సంద‌డి చేయ‌బోతున్నారు.

యు.కె. షెడ్యూల్ చిత్రీక‌ర‌ణ‌తో టాకీపార్ట్‌, పాట‌లు పూర్తయ్యాయి. సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడ‌క్షన్ కార్యక్రమాలు తుది ద‌శ‌కు చేరుకున్నాయి. అన్ని కార్యక్రమాల‌ు పూర్తిచేసి సినిమాను జూలై 5న ప్రపంచ వ్యాప్తంగా విడుద‌ల చేయ‌డానికి నిర్మాత కె.కె.రాధామోహ‌న్ స‌న్నాహాలు చేస్తున్నారు.

గోపీచంద్ హీరోగా న‌టిస్తోన్న ఈ సినిమాలో మెహ‌రీన్ నాయిక‌. పృథ్విరాజ్‌, జ‌య‌ప్రకాష్‌రెడ్డి త‌దిత‌రులు కీల‌క పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి క‌ళ‌: ఎ.ఎస్‌.ప్రకాష్‌, మాట‌లు: ర‌మేశ్‌రెడ్డి, స్క్రీన్‌‌ప్లే: కె.చ‌క్రవ‌ర్తి, బాబీ (కె.ఎస్‌.ర‌వీంద్ర), కో డైరెక్టర్‌: బెల్లంకొండ స‌త్యం బాబు, సంగీతం: గోపీ సుంద‌ర్‌, కెమెరా: ప్రసాద్ మూరెళ్ళ, నిర్మాత‌: కె.కె.రాధామోహ‌న్‌, క‌థ‌, ద‌ర్శక‌త్వం: కె.చ‌క్రవ‌ర్తి.