ఒక్కరోజే రూ.600 తగ్గిన గోల్డ్ ధర

09 July, 2019 - 8:47 PM

(న్యూవేవ్స్ డెస్క్)

న్యూఢిల్లీ: రెండు రోజులుగా ఆకాశాన్ని అంటిన బంగారం ధర మంగళవారం ఒక్కసారిగా పెద్దమొత్తంలో తగ్గింది. బడ్జెట్‌లో 10 నుంచి 12.5 శాతం దిగుమతి సుంకం ప్రతిపాదన అనంతరం బంగారం ధరలు నింగికెగిసిన విషయం తెలిసిందే. బులియన్‌ మార్కెట్‌లో 10 గ్రాముల గోల్డ్ రేట్ రూ.600 తగ్గిపోయింది. వెండి ధర రూ.48 తగ్గి, కిలో ధర రూ.38,900 పలుకుతోంది. అంతర్జాతీయంగా బలహీన ధోరణి, బలపడిన డాలరు, దేశీయంగా నగల తయారీదారుల నుంచి తగ్గిన డిమాండ్‌ తదితర పరిణామాల నేపథ్యంలో బంగారం ధరలు దిగి వచ్చాయని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు.

ఢిల్లీలో సోమవారంనాటి 99.9 స్వచ్ఛత గల పది గ్రాముల బంగారం ధర రూ.35,470తో పోలిస్తే 600 తగ్గి రూ.34,870గా ఉంది. ఫ్యూచర్స్‌ మార్కెట్‌లో కూడా పది గ్రాముల బంగారం ధర 98 రూపాయలు దిగువకు వచ్చి రూ.34,381 వద్ద ఉంది. కాగా.. సావరిన్‌ గోల్డ్‌ ధరలు మాత్రం స్థిరంగా ఉన్నాయి.