శ్రియ లుక్‌కి మంచి స్పందన

06 January, 2018 - 4:38 PM

(న్యూవేవ్స్ డెస్క్)

విలక్షణ నటుడు ఎం మోహన్‌బాబు ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం గాయత్రి. ఈ చిత్రంలో విష్ణు, శ్రియ కొత్త దంపతులుగా నటిస్తున్న పోస్టర్ జనవరి 1వ తేదీని విడుదల చేసిన సంగతి తెలిసిందే. అలాగే తాజాగా శ్రియ పోస్టర్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. మధ్య తరగతి గృహణిగా చీరకట్టుతో ఉన్న శ్రియ లుక్‌కి మంచి స్పందన వస్తుంది. నేనేదనుకుంటే అది చెప్పడం నాకు అలవాటు, తర్వాత సంగతి తర్వాత అని పోస్టర్‌పై ఉన్న ఉప శీర్షిక శ్రియ పాత్రకు ఉన్న ప్రాముఖ్యత వివరిస్తుంది.

మదన్ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రానికి సంగీతం ఎస్ ఎస్ తమన్ అందిస్తున్నారు. నిఖిల విమల్, బ్రహ్మానందం ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. గాయత్రి చిత్రం ఫిబ్రవరి 9వ తేదీన విడుదల కానుంది. శ్రీలక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ పై నిర్మిస్తున్న ఈ చిత్రానికి అరియానా, వివియానా మరియు విద్యా నిర్వాణ సమర్పిస్తున్నారు. ఈ చిత్రానికి మంచు మోహన్ బాబు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.