క్వీన్‌లో రమ్యకృష్ణ

07 September, 2019 - 3:18 PM

 

(న్యూవేవ్స్ డెస్క్)

హైదరాబాద్: జయలలిత. సినిమా పరిశ్రమలోనే కాదు, రాజకీయ రంగంలో కూడా తనదైన శైలిలో ప్రజల మనస్సులను చూరగొన్న నటి, రాజకీయ నాయకురాలు. తాజాగా ఆమె బయోపిక్‌ను వెబ్ సిరీస్ రూపంలో తెరకెక్కించనున్నారు. ఆ పనుల్లో ప్రముఖ దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్, ప్రశాంత్ మురగేషన్ నిమగ్నమైయున్నారు.  ఆ క్రమంలో జయలలిత చిన్ననాటికి సంబంధించిన విషయాలను ప్రశాంత్ మురుగేషన్ తెరకెక్కించనుండగా.. అలాగే జయలలిత సినీ జీవితాన్ని వదలి రాజకీయ ప్రవేశం చేయడం ఆ తర్వాత ఆమె జీవితంలో చోటు చేసుకున్న పరిణామాలను గౌతమ్ వాసుదేవ్ మీనన్ తెరకెక్కించనున్నారు.

అయితే జయలలిత రాజకీయ జీవితానికి సంబంధించి.. ఆ పాత్రలో ప్రముఖ నటి రమ్య కృష్ణ నటిస్తుందని తెలుస్తోంది. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే విడుదలచేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ జయలలిత బయోపిక్‌కు క్వీన్ అని పేరు పెట్టారు. కాగా..ఈ వెబ్ సిరీస్‌లో జయలలిత నెచ్చలి శశికళ పాత్ర లేకపోవడం గమనార్హం. అలాగే ఈ బయోపిక్ వెబ్ సిరీస్‌లో శోభన్ బాబు పాత్ర ఉంటుంది. ఈ పాత్ర  కీలకమని తెలుస్తోంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ పోస్టర్‌లో మహిళ ప్రజలవైపునకు తిరిగి ఉండటం.. గమనార్హం.