హైవే పై నాలుగు బస్సులు ఢీ!

29 September, 2017 - 9:06 AM


(న్యూవేవ్స్ డెస్క్)

చిత్తూరు: చిత్తూరులోని జాతీయ రహదారిపై శుక్రవారం ఉదయం నాలుగు బస్సులు ఢీ కొన్నాయి. చంద్రగిరి సమీపంలో ఎదురెదురుగా వస్తున్న నాలుగు బస్సులు ఢీ కొట్టుకున్నాయి. ఓ బస్సు హైవేపై ముళ్ల కంచెలోకి దూసుకెళ్లింది. బస్సు అద్దాలు ధ్వంసమయ్యాయి. అయితే డ్రైవర్ల అప్రమత్తతతో ప్రమాదం తప్పింది. ప్రయాణికులు సురక్షితంగా బయట పడ్డారు. అయితే నాలుగు బస్సుల్లోని పలువురు ప్రయాణికులకు స్వల్పగాయాలు అయినట్లు సమాచారం. దీంతో క్షతగాత్రులను ఆసుపత్రికి తరలిస్తున్నారు. సంఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు. యాక్సిడెంట్ తో ఈ రోడ్డులో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది.