రాజీవ్ శర్మపై ఏపీలో కేసు

14 June, 2017 - 9:47 AM

video

విజయవాడ నగర పాలక సంస్థలో కమిషనర్లుగా పనిచేసిన ఐదుగురు ఐఏఎస్‌ అధికారులపై విజయవాడ మూడో అదనపు మేజిస్ట్రేట్‌ కోర్టులో సోమవారం క్రిమినల్‌ కేసు నమోదు చేశారు. ఇందులో తెలంగాణ ప్రభుత్వ సలహాదారు డాక్టర్‌ రాజీవ్‌శర్మ కూడా ఉన్నారు. కాగా ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల సంస్థ డైరక్టర్‌ జి.రవిబాబు, ఉన్నత విద్య శాఖ కమిషనర్ జి.సువర్ణ పాండదాస్‌, కర్నూలు జాయింట్‌ కలెక్టర్‌ సి.హరికిరణ్‌, సిఆర్‌డిఎ జాయింట్‌ డైరెక్టర్‌ ఎస్‌.చక్రపాణి కూడా వీరిలో ఉన్నారు. వీరిపై గవర్నర్‌పేట పోలీస్‌స్టేషన్‌లో 10.03.2017న ఎఫ్‌ఐఆర్‌ నెంబరు 81 ఐపిసి సెక్షన్లు 167, 217,409, 2/00 ,34 ఐపిసితో పాటు 156(3)సిఆర్‌ పిసి కింద కేసు నమోదు చేశారు. ఈ అధికారులంతా 1989 లో విజయవాడ మునిసిపల్‌ కమిషనర్లుగా విధులు నిర్వహించినవారు.