అనుష్క ‘సైలెన్స్‌’

26 May, 2019 - 3:16 PM

(న్యూవేవ్స్ డెస్క్)

హైదరాబాద్: మాధవన్, అనుష్క జంటగా నటిస్తున్న చిత్రం నిశ్శబ్దం. ఈ చిత్రానికి హేమంత్ మధుకర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో హాలీవుడ్ స్టార్ మైఖేల్ మ్యాడసన్ నటిస్తున్నారు. అలాగే అంజలి, షాలినీ పాండే, సుబ్బరాజు, అవసరాల శ్రీనివాస్ కీలక భూమిక పోషిస్తున్నారు.

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ, కోన ఫిల్మ్ కార్పొరేషన్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాయి. ఈ చిత్రంలో అనుష్క దివ్యాంగురాలి పాత్రలో నటించనుందని సమాచారం. ఇప్పటికే సైజ్ జీరో చిత్రంలో ఆ పాత్రలో ఒదిగిపోయిన నటించిన అనుష్క… దివ్యాంగురాలి పాత్రలో కూడా అద్బుతంగా నటిస్తుందని టాలీవుడ్‌లో టాక్ వైరల్ అవుతోంది.

అమెరికాలో ఈ చిత్రానికి సంబంధించిన పూజాధికార్యక్రమాలు జరుపుకున్నాయి. అలాగే నిర్మాత కోన వెంకట్ సోదరి, స్టైలిస్ట్ నిరజా కోన.. ఈ చిత్రానికి సంబంధించిన క్లాప్ బోర్డ్‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అదేవిధంగా చిత్ర దర్శకుడు మధుకర్ కూడా తొలి రోజు జరుపుకున్న షూటింగ్.. ట్విట్టర్ వేదిగాకా పోస్ట్ చేశారు.

అనుష్క.. బాహుబలి .. ది బిగినింగ్, బాహుబలి ది కన్క్లూజన్ చిత్రాల్లో నటించారు. ఆ వెంటనే ఆమె భాగమతి చిత్రంలో నటించింది. ఈ చిత్రం కూడా సూపర్ డూపర్ హిట్ సాధించింది. ఆ తర్వాత ఆమె పలు చిత్రాల్లో నటిస్తుందంటూ మీడియాలో వార్తలు హల్‌చల్ చేశాయి. కానీ ఆమె ఏ చిత్రంలో నటించలేదు. కాగా.. ఆమె నిశ్శబ్దం / సైలెన్స్ చిత్రంలో నటిస్తుంది. ఈ చిత్రానికి గోపి సుందర్ సంగీతం అందిస్తున్నారు.