సత్యనారాయణకు సత్కారం

08 February, 2019 - 3:12 PM

(న్యూవేవ్స్ డెస్క్)

టాలీవుడ్‌ అనే పుస్తకంలో కైకాల సత్యనారాయణది ఓ ప్రత్యేకమైన పేజి. ఆయన నవరసాలను అవలీలగా పండించగల సత్తా ఉన్న మహానటుడు. అందుకే ఆయన్ని నవరస నటనా సార్వభౌమ అని తెలుగు ప్రేక్షకులు గౌరవంగా పిలుచుకుంటారు. కైకాల సత్యనారాయణ సిపాయి కూతురు చిత్రం ద్వారా టాలీవుడ్‌లోకి తెరంగేట్రం చేశారు.

ఈ చిత్రం విడుదలై 60 ఏళ్లు అయింది. ఈ నేపథ్యంలో కైకాల సత్యనారాయణను వంశీ ఇంటర్నేషనల్ సంస్థ కైకాల సత్యనారాయణ షష్టి పూర్తి కనకాభిషేక మహోత్సవం పేరిట సత్కరించబోతున్నట్లు ఆ సంస్థ వ్యవస్థాపకుడు వంశీ రామరాజు వెల్లడించారు.

ఫిబ్రవరి 12న హైదరాబాద్ రవీంద్రభారతిలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. ఈ మహోత్సవానికి తమిళనాడు మాజీ గవర్నర్ కె. రోశయ్య, రాజ్యసభ మాజీ ఎంపీ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, ప్రముఖ నటుడు గిరిబాబు, ప్రముఖ దర్శకులు కోదండరామిరెడ్డి, కోడిరామకృష్ణ, బి.గోపాల్, రేలంగి నరసింహరావు తదితరులు హజరవుతారని చెప్పారు.