రెండో ‘సాంగ్’ సూపర్ హిట్టే

12 November, 2019 - 8:57 PM

(న్యూవేవ్స్ డెస్క్)

హైదరాబాద్ : త్రివిక్రమ్ శ్రీనివాస్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్ అంటేనే ఓ క్రేజ్. వీళ్లిద్దరి కాంబినేషన్‌లో గతంలో వచ్చిన జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి చిత్రాలు సూపర్ డూపర్ హిట్ సాధించాయి. తాజాగా వీరిద్దరి కాంబినేషన్లో తెరకెక్కుతోన్న చిత్రం అల.. వైకుంఠపురంలో… . ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో  ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఇక ఈ చిత్రంలోని రెండు పాట్లను ఇప్పటికే విడుదల చేశారు. ఒకటి సామజవరగమన.. ఈ రిలికల్ పాట.. యూట్యూబ్‌లో వ్యూస్ .. కోట్లోలో దూసుకుపోతుంది.

అంతేకాదు.. లైక్స్ కూడా లక్షల్లో వచ్చాయి. ఇది ఓ విధంగా కొత్త రికార్డు సృష్టించింది. ఇక ఈ చిత్రంలోని రెండో పాట… రాములో రాములా.. సాంగ్ కూడా వ్యూస్ పరంగా దూసుకుపోతుంది. ఈ పాట 45 మిలియన్ల చేరుకుని.. 50 మిలియన్ల వైపు రాకెట్‌లా దూసుకుపోతుంది. ఈ నేపథ్యంలో ఆదిత్య మ్యూజిక్ వారు ట్విట్టర్ వేదికగా సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ చిత్రంలోని పాటలు ఇప్పటికే హిట్ కావడంతో.. ఈ చిత్రం కూడా సూపర్ డూపర్ హిట్ సాధిస్తుందని స్లైలిష్ స్టార ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.

ఈ చిత్రంలో అల్లు అర్జున్ సరసన పూజా హెగ్డే నటిస్తుంది. అలాగే ఈ చిత్రంలో టబూ, నవదీప్, సుశాంత్, మురళీశర్మ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.  ఈ చిత్రానికి ఎస్ ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నారు. హరికా అండ్ హాసిని క్రియేషన్స , గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి రాధాకృష్ణ, అల్లు అరవింద్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.