ముగిసిన ఎన్నికల కోడ్

26 May, 2019 - 10:08 PM

(న్యూవేవ్స్ డెస్క్)

న్యూఢిల్లీ: భారతదేశంలో సార్వత్రిక ఎన్నికల క్రతువు అధికారికంగా ముగిసింది. మే 23న ఎన్నికల ఫలితాలు విడుదలైన నేపథ్యంలో ఎన్నికల నియమావళిని ఎత్తివేస్తున్నట్టు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. లోక్‌సభ ఎన్నికలతో పాటు నాలుగు రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికల్ని ఈసీ నిర్వహించిన విషయం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్, అరుణాచల్‌ప్రదేశ్, సిక్కిం, ఒడిషా రాష్ట్రాల శాసనసభ ఎన్నికలు కూడా ఇదే సమయంలో జరిగాయి. మార్చి 10న ఎన్నికల షెడ్యూల్ విడుదల కాగా, మార్చి 18న తొలిదశ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నేపథ్యంలో దేశ వ్యాప్తంగా మూడు నెలలకు పైగా ఎన్నికల కోడ్ అమలులో ఉంది. కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటనతో ఎన్నికల కోడ్ ముగిసింది.