పేలిన మావోల మందుపాతర: 9 మంది జవాన్లు మృతి

13 March, 2018 - 2:16 PM

(న్యూవేవ్స్ డెస్క్)

భద్రాచలం: తెలంగాణ- ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో మంగళవారం మావోయిస్టులు మరోసారి ఘాతుకానికి పాల్పడ్డారు. ఈ ఎన్‌కౌంటర్‌లో 9 మంది సీఆర్‌పీఎఫ్ జవాన్లు మరణించారు. మరో ఆరుగురు జవాన్లు గాయపడ్డారు. సుకుమా జిల్లా గొల్లప్లలి- కిష్టారాం ప్రాంతంలో మావోలు పేల్చిన మందు పాతరకు 9 మంది సీఆర్‌పీఎఫ్ జవాన్లు మృతిచెందారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. మరణించిన జవాన్ల భౌతిక కాయాలను ప్రత్యేక హెలికాప్టర్‌లో భద్రాచలం ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకువచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. క్షతగాత్రులను చికిత్స కోసం రాయ్‌పూర్ ఆస్పత్రికి తరలిస్తున్నారు.

సీఆర్‌పీఎఫ్ జవాన్లపై మావోయిస్టులు మెరుపుదాడికి దిగారు. ఇటీవల జరిగిన ఎన్‌కౌంటర్లో 10 మంది మావోయిస్టులను భద్రతాదళాలు మట్టుపెట్టిన విషయం తెలిసిందే. ఆ ఎన్‌కౌంటర్‌కు మావోయిస్టులు ఇప్పుడు ప్రతీకారం తీర్చుకున్నట్లైంది.