ఏదైనా జరగొచ్చు

22 April, 2019 - 8:46 PM

(న్యూవేవ్స్ డెస్క్)

కె రమాకాంత్ దర్శకత్వంలో విజయ్ రాజా, రాఘవ, రవి శివ తేజలు నటించిన చిత్రం ఏదైనా జరగొచ్చు. ఈ చిత్ర టీజర్‌ సోమవారం ప్రముఖ దర్శకుడు వివి వినాయక్, శివాజీరాజా తనయుడు విజయ్ రాజా విడుదల చేశారు.

1.09 నిమిషాల నిడివి గల ఈ టీజర్ అద్యంతం హరర్ థ్రిల్లర్‌ను తలపిస్తోంది. ఈ చిత్రానికి సంగీతాన్ని శ్రీకాంత్ పెండ్యాల అందిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియవలసి ఉంది. ఈ చిత్రం హర్రర్ థ్రిల్లర్‌ అని దర్శకుడు కె రమాకాంత్ వెల్లడించారు. ఏ వెట్ బ్రెయిన్ ఎంటర్‌టైన్మెంట్ పతాకంపై ఈ చిత్రం నిర్మితమవుతోంది. సుధారం ప్రోడక్షన్స్ లో వస్తున్నది ఈ చిత్రం.