ప్రిన్స్‌తో మళ్లీ….

04 December, 2018 - 7:29 PM

(న్యూవేవ్స్ డెస్క్)

వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న చిత్రం మహర్షి. ఈ చిత్రంలో మహేష్ సరసన పూజా హెగ్డే నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రంలో మీనాక్షి దీక్షిత్ కూడా నటిస్తుందిట. ఇప్పటికే ఆమె దూకుడు చిత్రంలో మహేశ్ బాబు పక్కన ఓ పాటలో నటించిన సంగతి తెలిసిందే.

అయితే గత నాలుగళ్లలో దాదాపు ఆరు సినిమాల్లో నటించింది మీనాక్షి దీక్షిత్. కానీ మళ్లీ దక్షిణాదిలో అదీ మహేశ్ బాబు పక్కనే నటించే అవకాశం కోసం ఆమె ఎదురు చూస్తుందట. ఆ క్రమంలో ఆమెకు మహర్షిలో నటించే అవకాశం వచ్చింది. దీంతో ఆమె ఆనందానికి అవధులు లేకుండా పోయిందట.

ఈ చిత్రంలో పల్లెటూరు పిల్లగా అమాయకమైన పాత్రలో మీనాక్షి ఒదిగిపోయి నటిస్తుంది. ఆ క్రమంలో ఇప్పటికే ఆమె మహర్షి చిత్ర షూటింగ్‌లో పాల్గొంటుంది. ఈ చిత్ర షూటింగ్ ప్రస్తుతం రామోజీ పిలిం సిటీలో జరుపుకుంటున్న సంగతి తెలిసిందే.

మహేశ్ బాబు 25వ చిత్రంగా తెరకెక్కుతున్న చిత్రం మహర్షి. ఈ చిత్రంపై మహేశ్ బాబు ప్రత్యేక ఫోకస్ పెట్టారు. అలాగే ఈ చిత్రానికి నిర్మాతలుగా అశ్వనీదత్, దిల్ రాజు, పీవీపీ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అయితే ఈ చిత్రంలో మహేశ్ బాబు ద్విపాత్రాభినయం చేస్తున్న విషయం విదితమే.