దిల్ రాజు చేతిలో పవన్25 నైజాం రైట్స్?

13 September, 2017 - 2:26 PM


‘జల్సా’, ‘అత్తారింటికి దారేది’ వంటి బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాల తర్వాత పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా దర్శకుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తాజాగా ఓ చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రానికి ‘అజ్ఞాతవాసి’ అనే టైటిల్ ప్రచారంలో వుంది. భారీ అంచనాలతో రూపొందుతున్న ఈ చిత్ర నైజాం రికార్డు స్థాయికి అమ్ముడుపోయినట్లుగా తెలుస్తోంది. ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ చిత్ర నైజాం హక్కులను దాదాపు 29కోట్లు చెల్లించి, సొంతం చేసుకున్నట్లుగా తెలుస్తోంది.

ఇది ఇండస్ట్రీలో ‘నాన్ బాహుబలి’ రికార్డుగా సినీజనాలు పరిగణిస్తున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మాత రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు. ఇటీవలే విడుదలైన మ్యూజికల్ టీజర్‌కు భారీ రెస్పాన్స్ వచ్చింది. కీర్తిసురేష్, అను ఇమ్మాన్యుల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అన్ని కార్యక్రమాలను పూర్తిచేసుకొని వచ్చే ఏడాది సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.