థౌజండ్ క్లబ్‌కి 20 రన్స్ దూరంలో ధావన్

06 November, 2018 - 12:56 PM

(న్యూవేవ్స్ డెస్క్)

లక్నో: ఇటీవలి కాలంలో పరిమిత ఓవర్ల క్రికెట్‌‌లో ఆశించిన స్థాయిలో రాణించలేకపోతున్న టీమిండియా ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ అంతర్జాతీయ టీ20ల్లో వెయ్యి పరుగుల క్లబ్‌‌లో చేరేందుకు కొద్ది దూరంలో నిలిచాడు. ప్రస్తుతం అంతర్జాతీయ టీ20ల్లో 980 పరుగులు చేసిన ధావన్‌ మరో 20 రన్స్ చేస్తే వెయ్యి పరుగుల మైలురాయిని అందుకుంటాడు. మూడు టీ20ల సీరీస్‌లో భాగంగా విండీస్‌‌తో జరిగిన తొలి మ్యాచ్‌‌లో మూడు పరుగులు చేసి నిరాశపరిచిన ధావన్‌ మంగళవారం జరిగే రెండో టీ20లో వెయ్యి పరుగుల మార్కును చేరే అవకాశం ఉంది.

ఇప్పటి వరకూ అంతర్జాతీయ టీ20ల్లో వెయ్యి పరుగులు సాధించిన భారత ఆటగాళ్లలో విరాట్‌ కోహ్లి, సురేశ్‌ రైనా, ఎంఎస్‌ ధోని, యువరాజ్‌ సింగ్‌, రోహిత్‌ శర్మ మాత్రమే ఉన్నారు. ఇక భారత్ తరఫున వేగవంతంగా వెయ్యి పరుగులు సాధించిన ఆటగాళ్లలో కోహ్లి ముందు వరుసలో ఉన్నాడు. ఓవరాల్‌‌గా కోహ్లీ రెండో స్థానంలో కొనసాగుతున్నాడు.