అమర్‌కు ఏపీలో కీలక పదవి

23 August, 2019 - 12:30 AM

              (న్యూవేవ్స్ డెస్క్)

అమరావతి: సీనియర్‌ జర్నలిస్టు, ఇండియన్‌ జర్నలిస్టు యూనియన్‌ (ఐజేయూ) సెక్రటరీ జనరల్‌ దేవులపల్లి అమర్‌ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక పదవిలో నియమించింది. ఆయనను జాతీయ మీడియా- అంతరాష్ట్ర వ్యవహారాల్లో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ సలహాదారుగా నియమించింది. ఈ మేరకు సాధారణ పరిపాలన (రాజకీయ) శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆర్‌.పి. సిసోడియా గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ పదవిలో అమర్ సీఎం అభీష్టం ఉన్నంత ఉన్నంత వరకూ కొనసాగుతారని ఆ ఉత్తర్వుల్లో సిసోడియా స్పష్టం చేశారు. విధి విధానాలను మరో ఉత్తర్వులో వివరించనున్నట్లు జీఓలో వెల్లడించారు.