బైక్ రేసర్‌గా ‘హీరో’

21 May, 2019 - 6:22 PM

(న్యూవేవ్స్ డెస్క్)

విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కుతున్న నటిస్తున్న చిత్రం ‘హీరో’. ఈ చిత్రంలో విజయ్ సరసన మాళవిక మోహనన్ నటిస్తుంది. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ఇటీవలే పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ చిత్రానికి ఆనంద్ అన్నామలై దర్శకత్వం వహిస్తున్నారు.

ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ బైక్ రేసర్‌గా కనిపించనున్నారు. ఈ పాత్రలో నటించేందుకు విజయ్ ప్రత్యేకంగా శిక్షణ కూడా తీసుకున్నారని తెలుస్తోంది. అంతేకాకుండా.. విజయ్ దేవరకొండపై ఓ బైక్ సీన్ చేసేందుకు నిర్మాతలు భారీగా ప్లాన్ చేశారు.

అదీ కూడా దేశ రాజధాని ఢిల్లీలో చిత్రీకరించనున్నారని తెలుస్తోంది. ఈ ఒక్క సీన్ కోసమే కోట్లలో ఖర్చు పెట్టేందుకు నిర్మాతలు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ తెరకెక్కిస్తుంది. అలాగే ఈ చిత్రంలో నటిస్తున్న హీరోయిన్ మాళవిక మోహనన్.. ప్రముఖ పోటోగ్రాఫర్ కె.యు. మోహనన్ కుమార్తె. ఆమె రజనీకాంత్ నటిస్తున్న పేట చిత్రంలో నటించింది.

విజయ్ దేవరకొండ తాజాగా నటించిన చిత్రం డియర్ కామ్రేడ్. ఈ చిత్రం జులై 26న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. భరత్ కమ్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో రష్మిక హీరోయిన్‌గా నటిస్తుంది. ఇప్పటికే విజయ్ దేవరకొండ, రష్మిక జంటగా నటించిన గీత గోవిందం… సూపర్ డూపర్ హిట్ సాధించిన సంగతి తెలిసిందే.