తిరుపతిలో ఢిల్లీ వ్యక్తి దారుణ హత్య

08 May, 2018 - 2:13 PM

(న్యూవేవ్స్ డెస్క్)

తిరుపతి: ఢిల్లీకి చెందిన ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. ఈ ఘటన తిరుపతి రైల్వేస్టేషన్‌ సమీపంలోని ఓ హోటల్‌‌లో సోమవారం అర్ధరాత్రి సమయంలో జరిగింది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. మృతుడు ఢిల్లీకి చెందిన మునీత్‌‌ అని పోలీసులు భావిస్తున్నారు.

ఢిల్లీకి చెందిన మునీత్‌ భార్యతో కలిసి ఈ నెల 4న తిరుపతి వచ్చాడు. 5న నెల్లూరు మైపాడు బీచ్‌‌లో అతను మరో మహిళతో ఫొటో తీసుకున్నాడు. ఆ రోజు రాత్రి తరువాత తెల్లవారు జామున వెళ్ళి చూసిన హోటల్‌ సిబ్బందికి గదిలో రక్తపు మడుగు మధ్య మునీత్ కనిపించాడు. అయితే.. తన భర్త వెనుక వస్తున్నాడని హోటల్‌ సిబ్బందికి చెప్పి భార్య రైల్వేస్టేషన్‌‌కు వెళ్లిపోయింది.

తిరుపతి ఈస్ట్‌ పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు. హోటల్‌ గదిలోని సీసీ ఫుటేజీ పనిచేయడం లేదు. రోడ్డు మీద సీసీ ఫుటేజీ, మృతుడి కాల్‌‌డేటాను పోలీసులు పరిశీస్తున్నారు. ఆ గదిలో మద్యం సీసాలు కూడా లభించాయి. దీంతో వివాహేతర సంబంధమే ఈ హత్యకు కారణం కావచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితులకు సంబంధించిన ఆధారాలు దొరికాయి.

ఈ హత్య కేసు నిందితులను గుర్తించామని పోలీసులు తెలిపారు. మృతుడి బావమరిది ఈ కేసులో ప్రధాన నిందితుడని పోలీసులు గుర్తించారు. అతనితో పాటు మరో వ్యక్తి కలిసి ఢిల్లీకి చెందిన మునీత్‌ను హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. నిందితులను త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు చెబుతున్నారు.