ట్రైలర్‌లో డియర్ కామ్రేడ్

11 July, 2019 - 3:05 PM

(న్యూవేవ్స్ డెస్క్)

హైదరాబాద్: భరత్ కమ్మ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ, రష్మిక హీరోహీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం డియర్ కామ్రేడ్. ఈ చిత్ర ట్రైలర్ గురువారం విడుదల చేశారు. ఓ కామ్రేడ్ పోరాడితే.. అతనికి ఆ పోరాటం .. హాయిని ఇవ్వాలి… స్వేచ్ఛ నివ్వాలి.. నిన్ను చూస్తే అలా లేవు అంటూ ప్రముఖ నటుడు చారుహాసన్ చెప్పే డైలాగ్‌తో ఈ ట్రైలర్ ప్రారంభమవుతోంది.

ఆ తర్వాత వచ్చినప్పుడు ఎంతో అందంగా ఉన్న ప్రేమ వెళ్లిపోయేటప్పుడు ఎందుకింత బాధ పెడుతోంది ? అంటూ హీరో విజయ్ బాధపడుతున్న సన్నివేశం వస్తుంది. విడుదలైన కొద్దిసేపటికే ఈ ట్రైలర్ దూసుకుపోతుంది. విజయ్ దేవరకొండ అభిమానులను ఈ ట్రైలర్ విపరీతంగా ఆకట్టుకుంటుంది. ఈ చిత్రానికి జస్టిన్‌ ప్రభాకరన్ స్వరాలు సమకూర్చారు.

మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై ఈ చిత్రం నిర్మితమవుతోంది. ఈ చిత్రం జులై 26న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇప్పటికే విజయ్ దేవరకొండ, రష్మిక జంటగా నటించిన చిత్రం గీతగోవిందం. ఈ చిత్రం సూపర్ డూపర్ హిట్ సాధించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం తర్వాత వీరిద్దరి కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం ఇది.