దర్బార్‌లో ‘దుమ్మూ దూళీ’

27 November, 2019 - 6:45 PM

(న్యూవేవ్స్ డెస్క్)

ప్రముఖ దర్శకుడు ఎ.ఆర్. మురుగుదాస్ దర్శకత్వంలో సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా తెరకెక్కుతోన్న చిత్రం దర్బార్. ఈ చిత్రంలోని పాటను బుధవారం సోషల్ మీడియా వేదికగా విడుదల చేశారు. దుమ్మూ దూళీ అంటూ సాగే ఈ పాట.. విడుదలై.. వ్యూస్ పరంగా దూసుకుపోతుంది. దీంతో రజనీకాంత్ ఫ్యాన్స్‌ ఆనందానికి అవధులు లేకుండా పోయింది. జనవరి 9న ఈ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ పాటను ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం పాడారు. ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు.

ఈ చిత్రంలో దక్షిణ ప్రాంత పోలీస్ ఉన్నతాధికారి ఆదిత్య అరుణాచలం పాత్రలో రజనీ ఒదిగిపోయి నటించారు. ఈ చిత్రంలో రజనీ సరసన నయనతార నటిస్తోంది. అలాగే నివేదా థామస్, ప్రకాశ్ రాజ్, యోగిరాజు, మనోబాల, ప్రతీక్ బబర్, యోగి బాబు, యోగరాజ్ సింగ్, సునీల్ శెట్టి తదితరులు కీలక పాత్రలో నటించారు. ఈ చిత్రం షూటింగ్ పనులు ఇప్పటికే పూర్తి చేసుకుంది. డబ్బింగ్ పనులు కూడా పూర్తి కవోచ్చాయి.  ఈ చిత్రానికి లైకా ప్రోడక్షన్స్ నిర్మాతగా వ్యవహరిస్తోంది.