22న `దమ్ముంటే సొమ్మేరా` రిలీజ్

12 June, 2018 - 3:28 PM

సంతానం, అంచ‌ల్ సింగ్ హీరో హీరోయిన్లుగా శ్రీ తెన్నాండాళ్‌ ఫిలింస్ బ్యాన‌ర్‌‌పై రాంబాల ద‌ర్శక‌త్వంలో రూపొందిన `దిల్లుడు దుడ్డు` చిత్రాన్ని `శ్రీ కృష్ణా ప్రొడక్షన్స్ బ్యాన‌ర్‌‌పై న‌ట‌రాజ్ `ద‌మ్ముంటే సొమ్మేరా` టైటిల్‌‌తో అనువ‌దించి తెలుగులో విడుద‌ల చేస్తున్నారు. అన్ని ప‌నులు పూర్తిచేసుకుని ఈ నెల 22న ఈ మూవీ రిలీజ్ అవుతోంది.

ఈ సంద‌ర్భంగా సీనియ‌ర్ పాత్రికేయుడు పసుపులేటి రామారావు మాట్లాడుతూ.. `సంతానం త‌మిళ్‌లో హాస్య న‌టుడిగా ప‌రిచ‌యం అయ్యాడు. ఈ చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. ఆయ‌న గ‌త సినిమాలు తెలుగులో మంచి విజ‌యాన్ని సాధించాయి. ఇప్పుడు హీరోగా చేస్తోన్న సినిమా కావ‌డంతో మంచి అంచ‌నాలున్నాయి. ఈ నెల 22న భారీ ఎత్తున సినిమా రిలీజ్ అవుతుంది. అంద‌రూ త‌ప్పకుండా చూడాల్సిన సినిమా ఇది` అన్నారు.

శ్రీ కృష్ణా ప్రొడక్షన్స్ బిజినెస్ ఎగ్జిక్యూటివ్ న‌ర‌సింహారెడ్డి మాట్లాడుతూ..`త‌మిళంలో తెన్నాండాల్ ఫిలిమ్స్ నిర్మించిన సినిమా ఇది. అక్కడ పెద్ద విజ‌యం సాధించింది. తెలుగులో ద‌మ్ముంటే సొమ్మేరా టైటిల్‌తో అనువాదం చేసి రిలీజ్ చేస్తున్నాం. మా బ్యాన‌ర్లో రిలీజ్ అవుతోన్న తొలి సినిమా ఇది. ఈ నెల 22న రిలీజ్ చేస్తున్నాం. తెలుగు ప్రేక్షకులు అంతా త‌ప్పకుండా మా చిత్రాన్ని ఆద‌రించాలని కోరుకుంటున్నా` అని చెప్పారు.

శాన్య, క‌రుణాస్, శుర‌భ్ భుక్లా, ఆనంద్ రాజ్, లొల్లు శోభా మ‌నోహ‌ర్, టి.ఎమ్. కార్తిక్ న‌టిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: థ‌మ‌న్, పాట‌లు: మ‌ధ‌న్, కార్కీ, సినిమాటోగ్రఫీ: దీప‌క్ కుమార్ ప‌తి, ఎడిటింగ్: గోపీకృష్ణ, ఆర్ట్: ఏ.ఆర్. మోహ‌న్, యాక్షన్: హ‌రి దినేష్, బిజినెస్ ఎగ్జిక్యూటివ్: జె. న‌ర‌సింహారెడ్డి, నిర్మాత‌: న‌ట‌రాజ్.