సీపీఐ ప్రధాన కార్యదర్శిగా డి.రాజా

20 July, 2019 - 7:27 AM

(న్యూవేవ్స్ డెస్క్)

న్యూఢిల్లీ: భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) జాతీయ ప్రధాన కార్యదర్శిగా డి.రాజా పార్టీ పగ్గాలు చేపట్టనున్నారు. ప్రస్తుతం జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్న సురవరం సుధాకర్‌రెడ్డి అనారోగ్య కారణాల వల్ల ఆ బాధ్యతలు నిర్వహించలేనని గతంలోనే పార్టీకి తెలియజేశారు. ఈ నేపథ్యంలో ప్రధాన కార్యదర్శి మార్పునకు రంగం సిద్ధమైంది. శుక్రవారం ప్రారంభమైన పార్టీ జాతీయ మండలి సమావేశాలు ఆదివారంతో ముగుస్తాయి. ఈ సమావేశాల్లోనే డి.రాజాను జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకుంటారు.