సీఎం జగన్‌కి రామకృష్ణ లేఖ

25 June, 2019 - 5:38 PM

(న్యూవేవ్స్ డెస్క్)

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా కోసం అఖిల పక్ష బృందాన్ని ప్రధాని మోదీ వద్దకు తీసుకెళ్లాలని సీఎం వైయస్ జగన్‌ని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ డిమాండ్ చేశారు. అందుకోసం అన్ని పార్టీలతో సమావేశాన్ని ఏర్పాటు చేయాలని సీఎంకి ఆయన విజ్ఞప్తి చేశారు. మంగళవారం సీఎం వైయస్ జగన్‌కి కె. రామకృష్ణ బహిరంగ లేఖ రాశారు. ఆ లేఖను ఇక్కడ విడుదల చేశారు.

రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధిస్తారని నమ్మి… మీ పార్టీ తరఫున పోటీ చేసిన 22 మంది ఎంపీలను తెలుగు ప్రజలు గెలిపించారని ఈ సందర్భంగా వైయస్ జగన్‌కి రామకృష్ణ గుర్తు చేశారు. అయితే ఏపీతో సహా ఏ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్ సాక్షిగా ప్రకటించారని వైయస్ జగన్‌కి రామకృష్ణ గుర్తు చేశారు. బీహార్ ఎంపీ అడిగిన ఓ ప్రశ్నకు మంత్రి నిర్మాల సీతారామన్‌పై విధంగా సమాధానమిచ్చారు. దాంతో రామకృష్ణ అఖిల పక్షాన్ని డిల్లీ తీసుకు వెళ్లాలని డిమాండ్ చేశారు.