వర్మ… రచ్చ మళ్లీ మొదలు

28 October, 2019 - 6:32 PM

(న్యూవేవ్స్ డెస్క్)

హైదరాబాద్: రామ్ గోపాల్ వర్మ అంటేనే సంచలనాలకే సంచలనం. ఆయన వివాదాలమయం. అంతేకాదు.. ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రాలు సైతం వివాదాలకు కేంద్ర బిందువు. ఎన్టీఆర్ జీవితంలోకి లక్ష్మీ పార్వతీ ప్రవేశంచిన నాటి నుంచి ఆయన మరణం వరకు తీసిన చిత్రం లక్ష్మీస్ ఎన్టీఆర్. ఈ చిత్రం ఎంత పెద్ద హిట్ పెద్ద హిట్ సాధించిందో అందరికి తెలిసిందే. అంతేకాదు.. నాటి ఏపీ సీఎం, టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబుకి ఎన్నికల సమయంలో కంటి మీద కునుకు లేకుండా చేసిన చిత్రం. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే..బాబుకి అమాంతం హీట్ పెంచిన చిత్రం.

అయితే వర్మ దర్శకత్వంలో తాజాగా తెరకెక్కుతోన్న చిత్రం కమ్మరాజ్యంలోకి కడప రెడ్లు. ఈ చిత్ర ట్రైలర్.. దిపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని.. ఆదివారం విడుదల చేశారు. ఈ ట్రైలర్ చూస్తే.. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను ప్రతిబంభించే విధంగా ఉందని ఇట్టే అర్థమవుతోంది. ఈ ట్రైలర్‌లో వైయస్ జగన్, చంద్రబాబు, పవన్ కల్యాణ్, కెఏ పాల్ తదితరుల పాత్రలు కనిపించాయి. దీంతో పోలిటికల్ సర్కిల్‌లో ఇప్పటికే ట్రైలర్‌పై రచ్చ మొదలైంది. ఇక సినిమా విడుదల అయితే ఏన్ని సమస్యలు తెచ్చిపెడుతుందో అని టాక్ అటు టాలీవుడ్‌లోనే కాదు.. ఇటు పోలిటిక్ సర్కిల్‌టో టాక్ మొదలైంది.