‘అధిష్ఠానం చూసుకుంటుంది’

13 May, 2019 - 4:45 PM

(న్యూవేవ్స్ డెస్క్)

హైదరాబాద్: దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ గాలి వీస్తుందని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ అజారుద్దీన్ అన్నారు. గత ఐదేళ్లలో ప్రధాని మోదీ చేసిన అభివృద్ధి కంటే రాహుల్ ఫ్యామిలీపై చేసిన ఆరోపణలే ఎక్కువ అని గుర్తు చేశారు. విమర్శలకే మోదీ సమయం కేటాయిస్తున్నారన్నారు.

సోమవారం హైదరాబాద్‌లో అజారుద్దీన్ విలేకర్లతో మాట్లాడుతూ… ఉద్యోగాలు కల్పిస్తానన్న హామీని మోదీ పట్టించుకోలేదన్నారు. యూపీఏకు టీఆర్ఎస్ మద్దతు అవసరమైతే కాంగ్రెస్ అధిష్ఠానం చూసుకుంటుందని చెప్పారు. అంబర్ పేటలో మసీద్‌ను జీహెచ్ఎంసీ అక్రమంగా కూల్చివేసిందన్నారు. అందుకు కారణమైన అధికారులపై చర్యలు తీసుకోవాలంటూ ప్రభుత్వాన్ని అజారుద్దీన్‌ డిమాండ్ చేశారు.