‘అయితే సంతోషమే’

16 May, 2019 - 7:01 PM

(న్యూవేవ్స్ డెస్క్)

హైదరాబాద్: టీఆర్ఎస్‌తో మా అధిష్ఠానం పొత్తుకు స్వాగతిస్తే… మేము శిరసావహిస్తామని కాంగ్రెస్ పార్టీ నాయకుడు, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి స్పష్టం చేశారు. గురువారం హైదరాబాద్‌లో జగ్గారెడ్డి విలేకర్లతో మాట్లాడుతూ… రాష్ట్రంలో అధికారంతో మాకు సంబంధంలేదన్నారు.

రాష్ట్రంలో మేము అధికారంలోకలో లేకున్నా పర్వాలేదు కానీ మాకు కావాల్సింది మాత్రం రాహుల్‌ని ప్రధాని కావడమే అని తెలిపారు. రాష్ట్ర ప్రయోజనాల కంటే దేశ ప్రయోజనాలే ముఖ్యమని ఆయన వెల్లడించారు. తెలంగాణ సీఎం కేసీఆర్‌తో రాహుల్ ప్రధాని అయితే సంతోషమే అని అన్నారు.

రాజకీయాల్లో ప్రతిఒక్కరు తప్పులు చేస్తారన్నారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదన్నారు. ఎన్నికల సంఘం ఎప్పుడూ అధికార దుర్వినియోగానికి పాల్పడలేదన్నారు. అలా చేసి ఉంటే దేశంలో కొత్త పార్టీలు పుట్టి ఉండేవి కావన్నారు.

కొందరు పోలీసులు తమ పార్టీ నాయకులపై కక్ష సాధిస్తున్నారని ఆరోపించారు. పీసీసీ చీఫ్‌గా ఉత్తమ్ కుమార్ రెడ్డిని కొనసాగించాలని అధిష్ఠానానికి లేఖ రాస్తానని ఆయన పేర్కొన్నారు. ఓ వేళ ఉత్తమ్ తప్పుకుంటే.. శ్రీధర్ బాబు, రేవంత్ రెడ్డిలకే అవకాశం అని తెలిపారు.