మహాకూటమిలో సీట్ల సర్దుబాటు ఖరారు

08 November, 2018 - 7:18 PM

(న్యూవేవ్స్ డెస్క్)

ఢిల్లీ: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మహాకూటమి సీట్ల సర్దుబాటు గురువారం ఓ కొలిక్కి వచ్చింది. గురువారం సోనియా గాంధీ నివాసంలో కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం అయింది. అనంతరం కాంగ్రెస్ పార్టీ తెలంగాణ వ్యవహారాల బాధ్యుడు రామచంద్ర కుంతియా మీడియాతో మాట్లాడుతూ… మహాకూటమిలో మిత్రపక్షాలకు 25 సీట్లు కేటాయించినట్లు చెప్పారు.

కాంగ్రెస్ పార్టీ – 93 , టీడీపీ – 14 , తెజస – 8, సీపీఐ – 3 స్థానాలు చొప్పున కేటాయించామని తెలిపారు. అలాగే తెలంగాణ ఇంటి పార్టీకి ఒక్క స్థానం కేటాయిస్తామని వెల్లడించారు. ఇప్పటి వరకు కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ 74 మంది అభ్యర్థులు ఖరారు చేసిందన్నారు.

ఈ నెల 10వ తేదీన 74 మంది అభ్యర్థులతో తొలి జాబితా విడుదల చేస్తామన్నారు. మిగిలిన స్థానాలకు అభ్యర్థులపై రాహుల్‌తో చర్చించి.. నవంబర్ 11 లేదా 12న అభ్యర్థులను వెల్లడిస్తామని రామచంద్ర కుంతియా పేర్కొన్నారు.