డియర్ కామ్రేడ్ ‘గీతం’

18 July, 2019 - 9:14 PM

(న్యూవేవ్స్ డెస్క్)

హైదరాబాద్: భరత్ కమ్మ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ, రష్మిక హీరోహీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం డియర్ కామ్రేడ్. డియర్ కామ్రేడ్ గీతం పేరిట లిరికల్ వీడియోను గురువారం విడుదల చేశారు. తెలుగు ప్రజలారా అంటూ.. పాట సాగుతోంటే.. తెలుగు వారి ఆత్మ గౌరవం నినాదంతో పార్టీ పెట్టిన ఎన్టీఆర్ విగ్రహాన్ని ఈ వీడియోలో చూపించడంతో.. ఈ లిరికల్ వీడియో మొదలవుతోంది.

ఈ మొత్తం వీడియో చూస్తే… విద్యార్థి రాజకీయాలు నేపథ్యంలో సాగుతోంది. ఈ పాటను చైతన్య ప్రసాద్ రచించగా… జస్టిన్ ప్రభాకరన్ స్వరాలు సమకూర్చారు. ఈ పాట ద్వారా విజయ్ దేవరకొండ మరోసారి గొంతు సవరించుకున్నారు. అలాగే ఎమ్.సి. విక్కీ, టోనీ కూడా ఈ గీతాన్ని ఆలపించారు. నాలుగు భాషల్లో తెరకెక్కించిన ఈ డియర్ కామ్రేడ్ జులై 26న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది. మైత్రీ మూవీ మేకర్స్, బిగ్ బెన్ సినిమాస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి.