స్వాతి సెకండ్ ఇన్నింగ్స్‌

19 April, 2019 - 3:41 PM

(న్యూవేవ్స్ డెస్క్)

బుల్లి తెరపై కలర్స్ ప్రోగ్రామ్ చేసింది. అంతే కలర్స్ నే ఇంటి పేరుగా మార్చుకుని…. నాటి నుంచి కలర్స్ స్వాతిగా స్థిరపడింది. బుల్లి తెర నుంచి వెండి తెరపై వచ్చి.. పలు చిత్రాల్లో నటించింది. అలా పలు చిత్రాల్లో నటించింది. ఆ తర్వాత అష్టా చమ్మ, కార్తికేయ చిత్రాల్లో హీరోయిన్‌గా నటించి మంచి పేరు తెచ్చుకుంది. ఆ తర్వాత ఆమె పెళ్లి చేసుకుని స్థిరపడిపోయింది.

అయితే తాజాగా కలర్స్ స్వాతి సెకండ్ ఇన్నింగ్స్ చేయనున్నట్లు సమాచారం. అదీకూడా మళ్లీ నిఖిల్‌తో ఆమె జత కట్టి సినిమా చేయనున్నట్లు తెలుస్తోంది. వీరిద్దరి కాంబినేషన్‌లో గతంలో కార్తికేయ తెరకెక్కింది. ఈ చిత్రం మంచి విజయాన్నే అందుకుంది.

ఈ నేపథ్యంలో కార్తికేయ చిత్రానికి సీక్వెల్‌ తీయాలని ఆ చిత్ర యూనిట్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. అందుకోసం కలర్స్ స్వాతిని సంప్రదించగా.. అందుకు ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అదీకాక.. ఈ చిత్రంలో హీరోగా నిఖిల్ నటించేందుకు కూడా ఒప్పుకున్నారని సమాచారం.

కాగా ఇటీవల పలు ఇంటర్వ్యూల్లో … తాను మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేస్తున్నట్లు కలర్స్ స్వాతి ఎక్కడ ప్రకటించలేదు. ఇదే విషయంపై కలర్స్ స్వాతిని పలు ప్రశ్నలు సంధించినా ఆమె నుంచి సరైన సమాధానం రాలేదు.