‘ఢిల్లీలో చక్రం తిప్పేది మనమే’

15 April, 2019 - 7:50 PM

(న్యూవేవ్స్ డెస్క్)

హైదరాబాద్: ఆదిలాబాద్ జిల్లా పరిషత్ చైర్మన్ పదవికి కోవా లక్ష్మీ, పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పదవికి పుట్టా మధు పేర్లను తెలంగాణ సీఎం, టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ ఖరారు చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహాంపై గులాబీ బాస్ సోమవారం తెలంగాణ భవన్‌లో పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. అందులోభాగంగా రాష్ట్రంలోని 32 జిల్లాలు ఉన్నాయి.

ఈ నేపథ్యంలో రెండు జిల్లాలకు ఒకరు చొప్పున మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలకు కేసీఆర్ బాధ్యతలు అప్పగించారు. తెలంగాణలోని మొత్తం జడ్పీ, 530కిపైగా ఎంపీటీసీ పదవులు గెలుచుకోనే లక్ష్యంతో పని చేయాలని గులాబీ దళానికి సూచించారు. నియోజకవర్గాల విభజన జరుగుతోందని కేసీఆర్  ఈ సందర్భంగా పేర్కొన్నారు. పాత, కొత్త నేతలు అందరికీ అవకాశాలుంటాయిని కేసీఆర్త తెలిపారు.

లోక్ సభ ఎన్నికల తర్వాత ఢిల్లీలో చక్రం తిప్పేది మనమే అని కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. ఇప్పటికి 10 నివేదికలు వచ్చాయని చెప్పారు. లోక్ సభ ఎన్నికల్లో 16కు 16 ఎంపీ సీట్టు గెలిచేది టీఆర్ఎస్సే అని కేసీఆర్ జోస్యం చెప్పారు. ప్రజలు కోరుకున్నది చేసి తీరుతామని ఆయన స్పష్టం చేశారు.

మిగతా జిల్లాల జెడ్పీ చైర్మన్ పదవులను కూడా కేసీఆర్ సాధ్యమైనంత త్వరలో ఖరారు చేయనున్నారని సమాచారం. రెవెన్యూ, మున్సిపల్ శాఖలను పూర్తిగా ప్రక్షాళన చేస్తామని ఆయన స్పష్టం చేశారు. రెవెన్యూ వ్యవస్థను రద్దు చేస్తే.. పరిస్థితి ఎలా ఉంటుందంటూ ఈ సమావేశానికి హాజరైన పార్టీలోని సీనియర్ నేతలతో కేసీఆర్ చర్చించారు.

ప్రస్తుత రెవెన్యూ వ్యవస్థలో చాలా లోపాలు ఉన్నాయిని.. వాటిని మార్చాల్సిన ఆవశ్యకత చాలా ఉందని ఈ సందర్భంగా సీనియర్ నేతలు.. కేసీఆర్‌కు సూచించినట్లు తెలుస్తోంది. తెలంగాణ భవన్‌లో జరిగిన ఈ విస్తృత స్థాయి సమావేశానికి టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు పాల్గొన్నారు.