శ్రీవారి సేవలో నారా,నందమూరి కుటుంబాలు

14 January, 2018 - 11:56 AM

                                                             (న్యూవేవ్స్ డెస్క్)

తిరుమల: సీఎం చంద్రబాబు , ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కుటుంబ సభ్యులు ఆదివారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.  ఉదయం చిత్తూరు జిల్లా నారావారి పల్లెలో భోగి మంటలు వేసి సంక్రాంతి ఉత్సవాలను ప్రారంభించిన  సీఎం చంద్రబాబు ఆ తరువాత కుటుంబ సభ్యులతో కలసి తిరుమల చేరుకుని శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. చంద్రబాబుతో పాటు ఆయన సతీమణి భువనేశ్వరి, హీరో బాలకృష్ణ దంపతులు, మంత్రి లోకేష్ దంపతులు, నారా రోహిత్ తదితరులు తిరుమలకు వచ్చారు. శనివారం సాయంత్రం నారావారి పల్లెకు వచ్చిన సీఎం రాత్రి అక్కడే బస చేశారు. తిరుమలకు వచ్చిన సీఎం బంధుమిత్రులకు స్వాగతం పలికిన టీటీడీ అధికారులు, వారికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనం తరువాత తీర్థ ప్రసాదాలు అందించి, ఆశీర్వచనాలు పలికారు.